న్యూఢిల్లీ : గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎవర్గ్రీన్ సాంగ్ జాలిమ పాటను కొరియన్ వ్యక్తి హృద్యంగా ఆలపించిన వీడియో (Viral Video) తాజాగా నెట్టింట తెగ వైరలవుతోంది. నేహ అరోరా అనే యూజర్ ఈ వీడియోనను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఈ వైరల్ క్లిప్ ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్‌ను రాబట్టింది.
కొరియన్ జాంగ్సూ లీ మొబైల్ ఫోన్లో లిరిక్స్‌ను చూస్తూ సాంగ్‌ను మెలోడియస్గా పాడటం నెటిజన్లను ఆకట్టుకుంది. సూపర్ గుడ్..! మీ కొరియన్ భర్త ఎప్పుడు బాలీవుడ్ సింగర్‌గా ఎంట్రీ ఇస్తాడని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
సింగర్ లీపై నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు. హి ఈజ్ సో గుడ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, నన్ను నమ్ము..నా కంటే అతడు అద్భుతంగా పాడాడని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More