హోంవర్క్ ఒత్తిడి భరించలేక 9వ తరగతి విద్యార్ధి బలవన్మరణం
మితిమీరిన హోంవర్క్ చేయలేక ఒత్తిడిని అధిగమించేందుకు తొమ్మిదో తరగతి విద్యార్ధి అర్ధంతరంగా తనువు చాలించిన ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లా పేరాలంలో జరిగింది.
చెన్నై : మితిమీరిన హోంవర్క్ చేయలేక ఒత్తిడిని అధిగమించేందుకు తొమ్మిదో తరగతి విద్యార్ధి అర్ధంతరంగా తనువు చాలించిన ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లా పేరాలంలో జరిగింది. హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న స్కూల్ నుంచి వేరే స్కూల్కు తనను మార్చించాలని బాలుడి వినతిని తల్లితండ్రులు తోసిపుచ్చడంతో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సోమవారం ఉదయం ఒంటికి నిప్పంటించుకున్న బాలుడు ఆపై విగతజీవిగా మారాడు. బాలుడిని 9వ తరగతి విద్యార్ధి సంజయ్గా గుర్తించారు. సంజయ్ పేరాలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. స్కూల్లో హోంవర్క్ అధికంగా ఇస్తుండటంతో తనను వేరే స్కూల్లో చేర్పించాలని కోరగా తల్లితండ్రులు నిరాకరించారు.
తీవ్ర మనస్ధాపానికి లోనైన సంజయ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాలుడిని కాపాడిన కుటుంబసభ్యులు తిరువారూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు సంజయ్ మరణించాడు. పేరాలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Boy
- homework
- set ablaze
- stress
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

