రిపేర్ కోసం… తొలిసారి భారత్‌కు అమెరికా యుద్ధ నౌక
చెన్నై: రిపేర్ కోసం అమెరికా యద్ధ నౌక తొలిసారి భారత్‌కు వచ్చింది. అమెరికా నౌకా దళానికి చెందిన చార్లెస్ డ్రూ తమిళనాడుకు ఆదివారం చేరుకుంది. చెన్నైలోని కట్టుపల్లి వద్ద ఉన్న లార్సెన్ & టూబ్రో షిప్‌యార్డ్‌లో ఆ షిప్‌కు రిపేర్, నిర్వాహణ పనులు చేపడతారు. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మాడే, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. చెన్నైలోని అమెరికా కాన్సుల్ జనరల్ జుడిత్ రవిన్, ఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో డిఫెన్స్ అటాచ్‌కు చెందిన రియర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ కూడా స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ‘మేక్ ఇన్ ఇండియా’కు భారీ ప్రోత్సాహమని రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త కోణమని పేర్కొంది. ‘యూఎస్ నేవీ షిప్‌కు భారత్‌లో మరమ్మత్తు చేయడం ఇదే తొలిసారి. ఓడ నిర్వహణ పనులు చేపట్టేందుకు కట్టుపల్లిలోని ఎల్ అండ్ టి షిప్‌యార్డ్‌కు యూఎస్ నేవీ కాంట్రాక్ట్ ఇచ్చింది’ అని ప్రకటించింది. గ్లోబల్ షిప్ రిపేరింగ్ మార్కెట్లో భారతీయ షిప్‌యార్డ్‌ల సామర్థ్యాలను ఇది సూచిస్తుందని తెలిపింది. భారతీయ షిప్‌యార్డ్‌లు అధునాతన సాంకేతికతో, తక్కువ ఖర్చుతో ఓడ మరమ్మత్తు, నిర్వహణ సేవలు అందిస్తాయని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

