Prime Minister | హైదరాబాద్, ఏప్రిల్ 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): 76 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటివరకూ 15 మంది ప్రధానులుగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ అత్యధికంగా 16 సంవత్సరాల 286 రోజులపాటు ప్రధానిగా సేవలందించగా, గుల్జారీలాల్ నందా అత్యల్పంగా 26 రోజులపాటు రెండు దఫాల్లో తాత్కాలిక ప్రధానిగా కొనసాగారు.
29 రాష్ర్టాల్లో కేవలం 6 రాష్ర్టాల నుంచే ప్రధానులు ఎన్నిక కావడం గమనార్హం. మొత్తంగా ఉత్తరాది నుంచి 13 మంది పీఎంలుగా పనిచేయగా, దక్షిణాది నుంచి కేవలం ఇద్దరే ప్రధానులుగా ఎన్నికయ్యారు.
జవహర్లాల్ నెహ్రూ (కాంగ్రెస్)- 16 ఏండ్ల 286 రోజులు
ఇందిరాగాంధీ (కాంగ్రెస్)- 15 ఏండ్ల 350 రోజులు
మన్మోహన్సింగ్ (కాంగ్రెస్)- 10 ఏండ్ల 4 రోజులు
వాజ్‌పేయీ (బీజేపీ)- 6 ఏండ్ల 80 రోజులు
నరేంద్రమోదీ (బీజేపీ)- 9 ఏండ్ల 315 రోజులు
రాజీవ్‌గాంధీ (కాంగ్రెస్)- ఐదేండ్ల 32 రోజులు
పీవీ నరసింహారావు (కాంగ్రెస్)- నాలుగేండ్ల 330 రోజులు
మోరార్జీదేశాయ్ (జనతాపార్టీ)- రెండేండ్ల 126 రోజులు
లాల్‌బహదూర్‌శాస్త్రి (కాంగ్రెస్)- ఏడాది మీద 216 రోజులు
విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ (జనతాదళ్)- 343 రోజులు
ఐకే గుజ్రాల్ (జనతాదళ్)- 332 రోజులు
హెచ్డీ దేవెగౌడ (జనతాదళ్)- 324 రోజులు
చంద్రశేఖర్ (సమాజ్‌వాదీ జనతాపార్టీ)- 223 రోజులు
చరణ్‌సింగ్ (జనతాపార్టీ-సెక్యులర్)- 170 రోజులు
గుల్జారీలాల్ నందా (కాంగ్రెస్)- 26 రోజులు
ఉత్తరాది నుంచి ప్రధానులు- 13
దక్షిణాది నుంచి ప్రధానులు- 2