న్యూఢిల్లీ, మార్చి 16: భారత ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేసేందుకు ఫేస్‌బుక్‌తో పాటు పలు ఇతర సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, వాటిపై ఆంక్షలు విధించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో వాటి వ్యవస్థాపరమైన ప్రభావం, జోక్యాన్ని అడ్డుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా తక్కువ ధరకే యాడ్స్‌ను ఫేస్బుక్ ప్రసారం చేసిందంటూ మీడియా సంస్థ ‘అల్ జజిరా’ నివేదికను ఉటంకించారు. ఫేస్బుక్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాహుల్ అన్నారు.