న్యూఢిల్లీ: దేశంలోని రైలు మార్గాలు, రోడ్డు మార్గాల్లో నదులు, కాలువలపై వందలాది బ్రిడ్జిలను నిర్మించారు. వాటిలో పొడవైనవి, ఎత్తయినవి ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ రైల్వే లైన్ కోసం మరో ఎత్తయిన వంతెనను నిర్మాణం చేపట్టారు. మణిపూర్‌లోని జిరిబమ్-ఇంఫాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 111 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు నుంచి రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని ఈ రైల్వే ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సందీప్ శర్మ తెలిపారు.
ప్రస్తుతం జిరిబమ్-ఇంఫాల్ మధ్య రైలు మార్గం లేదు. రోడ్డు మార్గం (ఎన్‌హెచ్-37) ద్వారా ప్రయాణించాల్సిందే. ఈ రోడ్డు మార్గంలో జిరిబమ్ నుంచి ఇంఫాల్‌కు 220 కిలోమీటర్లు దూరం. ఈ మార్గంలో ప్రయాణానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతున్నది. అందుకే దూరాన్ని, సమయ భారాన్ని తగ్గించడం కోసం నోనీ లోయ మీదుగా ఆ రెండు నగరాల మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే ఎత్తయిన స్తంభాల నిర్మిస్తున్న ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా గుర్తింపు పొందనున్నది.
Imphal | Railway is constructing the world's tallest bridge pier in Manipur which is a part of 111 km long Jiribam-Imphal railway project
— ANI (@ANI) November 27, 2021
Sandeep Sharma,Chief Engineer of the project said, "With the completion of the project the 111 km of distance will be covered in 2-2.5 hrs." pic.twitter.com/Q358A9H1TC
Presently the distance between Jiribam-Imphal (NH-37) is 220 km, which took about 10-12 hrs of travelling. After the construction, the bridge crossing Noney valley will become the world's highest pier bridge," Sandeep Sharma, Chief Engineer of the project added. pic.twitter.com/2yTjbkGAnG
— ANI (@ANI) November 27, 2021