Delhi Rains : దేశంలో పలు చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఈమధ్యే ముంబై నగరాన్ని వణికించిన వరుణుడు ఇప్పుడు రాజధానిని ముంచెత్తుతున్నాడు. శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన ఢిల్లీలోని జనజీవనాన్ని స్తంభింపజేసింది. సాయంత్రం కూడా చినకులు పడుతుండడంతో, భారత వాతావరణ శాఖ (IMD) ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు గంటలు ఢిల్లీలో రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించింది.
వచ్చే మూడు గంటల్లో ఢిల్లీలోని ఏయే ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడుతాయో వివరిస్తూ మ్యాప్‌ను విడుదల చేసింది వాతావరణ కేంద్రం. పరిస్థితిని అంచనా వేస్తున్న మున్సిపల్ అధికారులు.. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
A 4 day long good rainy spell starting over north west #India today onwards.
Fairly widespread moderate to heavy rains are expected in #Delhi NCR #Haryana #Punjab #Rajasthan west #UttarPradesh #Chandigarh with peak during Sunday and Monday. Some pockets can expect very heavy… pic.twitter.com/B0p3jJ4N2d— Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) August 23, 2025
‘ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం నుంచి వాన దంచుతోంది. మరికొన్నిగంటలు వాన బీభత్సం కొనసాగనున్న నేపథ్యంలోవర్ష సూచన అప్డేట్ ఇది. రాబోయే మూడు గంటల్లో ఢిల్లీలోని పలు జిల్లాల్లో, దక్షిణ హర్యానా, తూర్పు రాజస్థాన్, ఉత్తర గుజరాత్ ప్రాంతంలో భారీగా వాన పడనుంది’ అని వాతావరణ శాఖ ట్వీట్లో పేర్కొంది. శనివారం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Another spell of monsoon rain has started in Delhi.#DelhiRains pic.twitter.com/Wvs9fZeLwM
— Ganpat Teli (@gateposts_) August 23, 2025
ఢిల్లీలోని సివిల్ లేన్స్, ఎర్రకోట, లజపత్ నగర్, నరేలా, బవనా, అలీపూర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, పబ్లిక్ వర్క్క్, వరద నియంత్రణ అధికారులు అత్యవసర సాయం కోసం తమను సంప్రదించాలంటూ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ తమకు నీళ్లు నిలిచిపోయాయని పది ఫిర్యాదులు అందాయని.. వాటిని గంటలోపే పరిష్కరించామని వరద నియంత్రణ అధికారులు తెలిపారు.