రోదసి నుంచి తీసిన రామసేతు ఫొటో ఇది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన కోపర్నికస్ సెంటినల్-2 శాటిలైట్ ఈ చిత్రాలను తీసింది.
రామేశ్వరం నుంచి శ్రీలంకను కలిపే ఈ వారధికి భారత్లో చారిత్రకంగా అత్యంత ప్రాధాన్యం ఉన్నది. లంకను చేరుకునేందుకు వానర సైన్యంతో కలిసి శ్రీరాముడు ఈ వారధిని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి.