న్యూఢిల్లీ, మే 31 : ఉగ్రవాదాన్ని పెంచి పోషించటంలో పాకిస్థాన్ తన వంకరబుద్ధిని మాత్రం మార్చుకోవటం లేదు. జమ్ముకశ్మీర్‌లోని ఉగ్ర నెట్వర్క్ ల కోసం అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. సరిహద్దుల వెంబడి భారత్ వైపు అక్రమంగా సెల్యులార్ సంకేతాలను పంపిస్తున్నది.
ఇది ఉగ్రవాదుల రహస్య కమ్యూనికేషన్లకూ ఊపిరిగా మారుతున్నదని అధికారులు వెల్లడించారు. దక్షిణ పిర్ పంజాల్ పర్వతశ్రేణుల్లో చొరబాట్లు పెరుగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఏర్పాటుచేసిన సెల్ టవర్ల సంకేతాలు కరుడుగట్టిన ఉగ్రవాదులున్న జైళ్లకు చేరుతున్నాయి. ముఖ్యంగా మైదాన ప్రాంతం జమ్ములో ఈ సంకేతాలు భారత్‌లోకి చొరబడి ఉగ్ర నెట్‌వర్క్‌లకు చేరుతున్నాయి.