బెంగళూరు: పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనతో ఇరుకునపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సోదరుడు విక్రమ్ సింహాపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. కర్ణాటకలోని హసన్ జిల్లా, నందగొండనహళ్లి గ్రా మంలో అనుమతి లేకుండా 120 చెట్లను నరికేసి, అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపించింది. తహశీల్దారు మమత ఈ ప్రాంతంలో పర్యటించినపుడు చెట్ల నరికివేతను గుర్తించి, తమకు సమాచారం ఇ చ్చారని తెలిపింది. పశువుల మేత కోసం ఉద్దేశించిన 12 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిలో ఈ చె ట్లు ఉన్నట్లు తెలిపింది. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ, విక్రమ్ సింహా 15 రోజుల నుంచి ఈ చెట్లను నరికిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు.