న్యూఢిల్లీ: యూపీలో కుంభమేళా జరిగిన సమయంలో ఐఐటీయన్ బాబా(IITian Baba) ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అతని అసలు పేరు అభయ్. ఆ బాబా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. భార్య ప్రీతికతో కలిసి ఆయన స్వగ్రామం జాజర్ వెళ్లాడు. దీంతో అక్కడ ప్రజలు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. బ్యాంక్ అవసరాల నిమిత్తం ఆ జంట హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. తండ్రిని కలిసేందుకు అతను స్థానిక కోర్టుకు వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న జనం అతన్ని కలిసేందుకు ఎగబడ్డారు. ఫోటోలు, సెల్ఫీలు కోసం క్యూకట్టారు. మీడియాతో అతను కాసేపు ఇంటరాక్ట్ అయ్యారు. భార్య ప్రీతిక కర్నాటకు చెందినట్లు చెప్పాడు. ఒకే లక్ష్యంతో ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తమ పేరెంట్స్‌ను కలవనున్నట్లు అతను చెప్పాడు.
ఓ పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చేందకు స్వంత కుటుంబానికి దూరం కావాల్సి ఉంటుందన్నారు. శ్రీ యూనివర్సిటీని స్థాపించాలనుకుంటున్నట్లు అభయ్ తెలిపాడు. ఆధ్యాత్మిక విధానాలతో జ్ఞానాన్ని పెంపొందించే అంశాలపై ఆ వర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. రకరకాల సాధనల గురించి తమ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోనే అభయ్ తన ఆధ్యాత్మిక జర్నీ కొనసాగిస్తున్నాడు.