న్యూఢిల్లీ, జూన్ 6 : 12వ తరగతిలో కనీస మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని దాన్ని నిర్వహించిన ఐఐటీ రూర్కీ చెప్పింది. అయితే స్టూడెంట్లకు వచ్చిన జేఈఈ ర్యాంకును బట్టి సీట్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేసింది.
జనరల్, ఓబీసీ-ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 12వ తరగతిలో పరీక్షలో 75 శాతం లోపు, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం లోపు మార్కులు వచ్చినా కౌన్సెలింగ్లో పాల్గొనొచ్చని తెలిపింది. అభ్యర్థులు కచ్చితంగా తమ రివైజ్డ్ స్కోర్ కార్డును జూలై 15లోపు సమర్పించాలని సూచించింది.