న్యూఢిల్లీ: బలహీనంగా, కూలిపోయే స్థితిలో ఉన్న వంతెనల గురించి ముందుగానే హెచ్చరించే డిజిటల్ పరికరాన్ని ఐఐటీ మండీ ప్రొఫెసర్ డాక్టర్ శుభమయ్ సేన్ అభివృద్ధి చేశారు. పరిశోధకుడు ఈశ్వర్ కుంచుమ్తో కలిసి దీనిని రూపొందించారు.
వంతెనలో అత్యంత బలహీనంగా ఉన్న చోట దీనిని అమర్చితే, దీనిలోని అల్గోరిథం ఎప్పటికప్పుడు వంతెన భద్రత, పటిష్టత ఏ స్థితిలో ఉందో గుర్తించి సమాచారాన్ని అందజేస్తుంది.ఈ డిజిటల్ మోడల్ ద్వారా వంతెన పరిస్థితిని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వరదలు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో కూలిపోయే అవకాశం ఉన్న వంతెనల సమాచారాన్ని ఈ పరికరం అప్పటికప్పుడు వివిధ శాఖలకు పంపిస్తుంది.