చెన్నై: దేశంలోని ఐఐటీల్లో 2024-25 అకడమిక్ ఇయర్కుగాను ప్లేస్‌మెంట్స్ (Placements) ప్రారంభమయ్యాయి. ఇందులో ఐఐటియన్లు కోట్లు కొల్లగొడుతున్నారు. అత్యుత్తమ ప్రతిభ ఉన్న విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు టాప్ కంపెనీలు కండ్లు చెదిరే ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీ మద్రాస్ (IIT Madras)కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఏకంగా రూ.4 కోట్ల వేతనం అందుకున్నారు. బేస్, ఫిక్స్డ్ బోనస్, రీలొకేషన్ వంటి వాటితో సహా మొత్తం రూ.4.3 కోట్లకుపైగా ప్యాకేజీని జేన్ స్ట్రీట్ క్యాపిల్ అనే ట్రేడింగ్ సంస్థ అతనికి ఆఫర్ చేసింది. అయితే అతడు హాంకాంగ్‌లో క్వాటిటేటివ్ ట్రేడర్‌గా పనిచేయాల్సి ఉంటుంది.
ఐఐటీ ఢిల్లీ, బాంబే, మద్రాస్, కాన్పూర్, రూర్కీ, ఖరగ్‌పూర్, గౌహతి, బీహెచ్‌యూలలో తుది నియామకాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వచ్చిన రిక్రూటర్లలో బ్లాక్‌రాక్, గ్లీన్ అండ్ డావిన్సీ, క్వాడు, క్వాంట్‌బాక్స్, క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ సాక్స్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, అల్ఫోన్సో, న్యూటానిక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. అయితే గత సీజన్‌తో పోలిస్తే ఈసారి భారీ ప్యాకేజీలను కంపెనీలు ప్రకటించాయి.
ఎక్కువ ప్యాకేజీలు ఆఫర్ చేసిన కంపెనీలు..