గువాహటి: మనిషి ఇన్సులిన్‌ను మరింత చౌకగా తయారుచేసే పద్ధతిని ఐఐటీ గువాహటి పరిశోధకులు కనుగొన్నారు. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనే బాక్టీరియా సాయంతో సురక్షితమైన, సమర్థమైన రీతిలో ఔషధ తయారీకి దోహదపడే ఈ ప్రక్రియ వల్ల ఇన్సులిన్ మరింత చౌకగా అందుబాటులోకి రాగలదని ఐఐటీ గువాహటి తెలిపింది. దీనికి రెండు భారత పేటెంట్లు లభించాయి.
సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ బాక్టీరియాతో ఇన్సులిన్ తయారీ విధానాన్ని కనుగొన్నామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన నూజివీడులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ మాజీ డైరెక్టర్ వీరంకి వెంకటదాసు తెలిపారు.