న్యూఢిల్లీ : వాయు కాలుష్యంపై అవగాహన పెంచేందుకు ఐఐటీ ఢిల్లీ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం కూ చేతులు కలిపాయి. పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణపై పలు భాషల్లో పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడతారు. కాలుష్య స్ధాయిలపై వాటి ప్రభావాన్ని తగ్గించే చర్యలపై స్ధానిక భాషల్లో కంటెంట్‌ను రూపొందించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు.
తొలిసారిగా సోషల్ మీడియాను వాడుతున్న యూజర్లతో పాటు భిన్నమైన ఆడియన్స్‌కు చేరువవడం ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపడతామని ప్రొఫెసర్ పీ విఘ్నేశ్వర ఇలవరసన్, ఐఐటీ ఢిల్లీ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం చైర్ ప్రొఫెసర్ అబ్దుల్అజీజ్ అల్సాగర్ తెలిపారు.
కాలుష్యంపై శాస్త్రీయ ఆధారిత సమాచారాన్ని ప్రజల కోసం కూ వంటి సోషల్ మీడియా వేదిక ద్వారా చేరవేస్తామని వారు వివరించారు. స్దానిక భాషలకు అనుగుణంగా ఎంపిక చేసిన కంటెంట్‌తో మెరుగైన ఫలితాలు రాబడతామని, కాలుష్య నియంత్రణ దిశగా ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.