ముంబై, జనవరి 24: ఐఐటీ బాంబేలో చదివి జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థి దంపతులు తమకు విద్యా దానం చేసిన సంస్థకు రూ.95 కోట్లను విరాళంగా అందజేశారు. విద్య, ఆవిష్కరణ రంగాల్లో ఐఐటీ బాంబే అమలు చేయనున్న కొత్త ఆలోచనల కోసం తమ విరాళాన్ని ఖర్చు చేయాలని జితే్రంద మోహన్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, 1994 బ్యాచ్), స్వప్న సమంత్(సివిల్ ఇంజినీరింగ్, 1995 బ్యాచ్) సూచించారు. ఈ దంపతులు ఇచ్చిన విరాళంతో స్టెమ్ కోర్సుల్లో మహిళా అధ్యాపకులకు మద్దతుగా నిలిచి వారి సాధికారతకు తోడ్పడటం కోసం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో విద్య శర్మ చైర్ ప్రొఫెసర్షిప్ను ఏర్పాటు చేయనున్నారు.