ముంబై : పాకిస్థాన్‌కు మద్దతిస్తున్న తుర్కియేపై భారతీయుల నిరసన తీవ్రమవుతున్నది. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే స్పందించింది. తుర్కియేలోని విశ్వవిద్యాలయాలతో చేసుకున్న అన్ని ఒప్పందాలను తదుపరి నోటీసు జారీ చేసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది.
దీంతో కొన్ని టర్కిష్ విద్యా సంస్థలతో ఐఐటీ-బాంబే కుదుర్చుకున్న ఫ్యాకల్టీ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ నిలిచిపోయింది. జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా, ఐఐటీ-రూర్కీ కూడా తుర్కియేతో ఒప్పందాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.