న్యూఢిల్లీ: ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల వారీగా విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాకింగ్స్-2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) టాప్-100లో చోటు దక్కించుకుంది. 60.5 స్కోర్‌తో 99వ స్థానంలో నిలిచింది.
ఇంజినీరింగ్ సబ్జెక్ట్ ర్యాకింగ్స్-2025లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం 97.5 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాలను స్టాన్‌ఫర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్ దక్కించుకున్నాయి. భారత్‌కు చెందిన అన్నా యూనివర్సిటీ 251-300 ర్యాకింగ్ రేంజ్లో నిలిచింది.