న్యూఢిల్లీ: ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి(IFS officer) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న ఓ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఆఫీసర్‌ను జితేంద్ర రావత్గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే అతని మృతిలో ఎటువంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వయసు 35 నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆఫీసర్ మృతి పట్ల దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ డిప్రెషన్లో ఉన్నారని, చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.
STORY | IFS officer ends life by jumping from building in Delhi’s Chanakyapuri
READ: https://t.co/FwmNBJWFE9 pic.twitter.com/3rgG2ckK5i
— Press Trust of India (@PTI_News) March 7, 2025