న్యూఢిల్లీ : నోరు ఆరోగ్యంగా ఉంటే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ పరిశోధకులు తెలిపారు. ప్రాథమిక స్థాయిలో మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్య నిర్వహణలో నోటి సంరక్షణ చర్యలను భాగం చేయాలన్నారు.
నోటి ఆరోగ్యం సక్రమంగా లేకపోతే గుండె జబ్బులు, అల్జీమర్స్, మధుమేహం, గర్భవతులపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని తెలిపారు. ఎయిమ్స్ ఆంకాలజిస్టులు డాక్టర్ అభిషేక్ శంకర్, డాక్టర్ వైభవ్ సాహ్ని రాసిన వ్యాసంలో ఈ వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ ముప్పు, దాని గుర్తింపులో, ముఖ్యంగా, తల, మెడ క్యాన్సర్ల విషయంలో, నోటి ఆరోగ్యాన్ని భాగం చేశారు.