న్యూఢిల్లీ, ఆగస్టు 6: లా చదివిన గ్రాడ్యుయేట్లు ఐదేండ్లకు పైగా ప్రాక్టీస్ చేయకుండా ఉండి, తిరిగి న్యాయవాద వృత్తిలోకి రావాలనుకుంటే ఆలిండియా బార్ పరీక్ష (ఏఐబీఈ) రాయాల్సిందేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. చేస్తున్న వేరే ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే బార్ కౌన్సిల్లో నమోదు చేసుకోవడానికి అనుమతిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.