అహ్మదాబాద్: సాధారణంగా కార్లు, బస్సులు రోడ్డుపై మొరాయించినప్పుడు వాటిని తోయడం మనం చూస్తుంటాం. అయితే విమానాశ్రయంలోని ఒక విమానం కదలలేదు. దీంతో కొంతమంది గ్రౌండ్ సిబ్బంది దానిని తోశారు. (Plane Pushed) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనే ఇలాంటివి జరుగుతాయంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు పొందిన గుజరాత్‌లోని సూరత్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఆ ఎయిర్‌పోర్ట్‌లో నిలిచి ఉన్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అది కదలలేదు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ సిబ్బంది ఆ విమానాన్ని వెనక్కి తోశారు.
కాగా, ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న కొందరు ప్రయాణికులు దీనిని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయెంకాను కూడా ఈ వీడియో క్లిప్ ఆకట్టుకున్నది. దీంతో ఆయన ఎక్స్‌లో దీనిని షేర్ చేశారు. ‘విమానం స్టార్ట్ కాకపోతే.. భారతదేశంలో మాత్రమే’ అని క్యాప్షన్ ఇచ్చారు.
మరోవైపు వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇతర దేశాల మాదిరిగా నిఫుణుల కోసం మనవారు వేచి ఉండరని, మనకు అన్ని చోట్లా నిపుణులు ఉన్నారని ఒకరు పేర్కొన్నారు. రాకెట్ విడి భాగాలను సైకిల్‌పై మోసుకెళ్లి ప్రయోగించిన ఏకైక దేశం మనదేనని గుర్తు చేశారు.
కాగా, సాధారణంగా విమానాలు వెనక్కి కదలవని ఒకరు తెలిపారు. అందుకే దానిని వెనక్కి తరలించడానికి ఇదే ఏకైక పరిష్కారమని పేర్కొన్నారు. అయితే విమానాన్ని తోయడంపై మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
If the plane doesn’t start……only in India 😀 pic.twitter.com/Iqr4Kx5f5g
— Harsh Goenka (@hvgoenka) January 17, 2025