న్యూఢిల్లీ, మే 9: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి ఎప్పటికప్పుడు అనూహ్య విషయాలు బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒక వార్త వెలుగుచూసింది. ఒకవేళ ఏదైనా దాడుల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరణిస్తే, తక్షణమే అణుదాడులు చేసేలా ఉత్తర కొరియా తన విధానాలను సవరించినట్టు తెలుస్తున్నది.
ఈమేరకు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికా-ఇజ్రాయెల్ తొలిరోజు జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేకమంది సీనియర్ నాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా ఈ మార్పులు చేసినట్టు తెలుస్తున్నది. ఇటీవల ప్యాంగ్యాంగ్లో జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ మొదటి సమావేశంలో ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించినట్టు కథనాలు పేర్కొన్నాయి.