Rahul Gandhi | మోదీ ఇంటిపేరు కేసు.. క్షమాపణలు చెప్పేదే లేదన్న రాహుల్
Rahul Gandhi | ప్రధాని మోదీ ఇంటి పేరు (Modi Surname Case)పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు (Apologise) చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు.
Rahul Gandhi | ప్రధాని మోదీ ఇంటి పేరు (Modi Surname Case)పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు (Apologise) చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు క్షమాపణలు చెప్పడమంటే న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసినట్టే అవుతుందన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు (Supreme Court)లో బుధవారం ఓ అఫిడవిట్ దాఖలు చేశారు.
2019లో కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకు ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ (Purnesh Ishwarbhai Modi) పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును రాహుల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ కేసు ‘అసాధారణమైన కేటగిరి’ కిందకు రాదని, తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ‘నేను ఎలాంటి నేరానికీ పాల్పడలేదు. శిక్షార్హమైన నేరం చేయలేదు. క్షమాపణలు చెప్పే తప్పు చేసి ఉంటే ఇప్పటికే చెప్పేవాడిని. ఏ తప్పూ చేయకున్నా క్షమాపణలు చెప్తే అదే పెద్ద శిక్ష అవుతుంది’ అని రాహుల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందుకు ఫిర్యాదుదారు పూర్ణేశ్ తనను ‘అహంకారి’ అని పేర్కొన్నట్లు రాహుల్ తెలిపారు. తాను ఏ నేరం చేయలేదని, అయినా ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద క్రిమినల్ నేరం మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. సూరత్ కోర్టు తనకు విధించిన జైలు శిక్షను నిలుపుదల చేసి.. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అఫిడవిట్లో కోరారు.
Also Read..
Gyanvapi | జ్ఞానవాపి మసీదులో సర్వేకి అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Shoaib Malik – Sania Mirza | ఇన్ స్టా బయోలో షోయబ్ కీలక మార్పు.. సానియాతో విడాకులు నిజమేనా..?
Minister Harish Rao | అవయవదానంతో మరొకరికి పునర్జన్మ : మంత్రి హరీశ్‌రావు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

