కాశీ: ప్రధాని మోదీ ఇవాళ కాశీ కారిడార్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. విశ్వనాథుడి ప్రియదినం సోమవారం అని.. దశమి తిథి..ఇక్కడ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. విశ్వనాథ ధామం అకల్పనీయ రీతిలో వెలిగిపోతోందన్నారు. ఈ క్షేత్రాన్ని పునస్థాపితం చేస్తున్నామన్నారు. కాశీ అవినాశిని అని, ఇక్కడ ఒకటే సర్కార్ ఉంటుందని, ఎవరి చేతుల్లో ఢమరుకం ఉంటుందో, వారి సర్కారే ఇక్కడ నడుస్తుందని మోదీ అన్నారు. శివుడి ప్రసన్నతలేనిదే ఇక్కడకు ఎవరూ రాలేనన్నారు. ఇక్కడ ఏది జరిగినా.. అది మహాదేవుడి ఇచ్ఛతోనే జరుగుతందన్నారు. ఇక్కడ జరిగిందంతా కూడా ఆ మహాదేవుడే చేశారన్నారు.
ఆకతాయిలు ఈ నగరంపై ఆక్రమణ చేశారని, ధ్వంసం చేయాలని చూశారన్నారు. ఔరంగజేబు అత్యాచారాలు.. అతని ఆకతాయి పనులకు సాక్ష్యాలన్నారు. ఇక్కడి సభ్యతను తల్వార్‌తో మార్చాలనుకున్నాడని, సంస్కృతిని నాశనం చేయాలనుకున్నాడని, కానీ ఈ భూమి మట్టి మిగితా ప్రపంచంతో వేరైందన్నారు. ఇక్కడకు ఔరంగజేబు వస్తే, అప్పుడు శివాజీ కూడా ఎదురు నిలబడుతారన్నారు. సాలార్ మసూద్ ఇటు వైపు వస్తే.. రాజా సుహల్దేవ్ లాంటి వీర యోధులు శక్తి చాటుతారన్నారు. ఆంగ్లేయుల పాలన సమయంలోనూ వారెన్ హాస్టింగ్కు కాశీవాసులు ఎటువంటి దుస్థితి పట్టించారో గుర్తు తెచ్చుకోవాలన్నారు.
కాశీకి రావడానికి నేటి తరం వాళ్లు గర్వంగా ఫీలవుతారన్నారు. ఇది ప్రాచీన, ఆధునిక సంస్కృతల మేళవింపు అన్నారు. కొత్త చరిత్రను సృష్టించామన్నారు. దీన్ని వీక్షించడం మన అదృష్టమన్నారు. బనారస్‌కు విశ్వాసంతో వచ్చానన్నారు. ఇక్కడ ప్రజలపై విశ్వాసంతో వచ్చినట్లు చెప్పారు.