న్యూఢిల్లీ, జనవరి 14: థాయిలాండ్‌లో గబ్బిలం జాతికి చెందిన కొత్త వైరస్‌ను గుర్తించారు. ఇది మనుషులపై ప్రభావం చూపే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. గతంలో కరోనా వైరస్ కూడా గబ్బిలాల నుంచే పుట్టినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త వైరస్‌పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అయితే ఈ కొత్త వైరస్‌ను గుర్తించిన థాయ్‌లాండ్‌కు చెందిన పరిశోధన సంస్థ ఎకో హెల్త్ అలియన్స్‌కు వివాదాస్పద సంస్థగా పేరుంది. గతంలో వూహాన్లో జరిగిన పరిశోధనలతో ఈ సంస్థకు సంబంధం ఉంది.