Golconda diamond : భారతదేశపు రాజవంశానికి అరుదైన డైమండ్ (Diamond) ను వచ్చే నెలలో వేలం వేయనున్నారు. గోల్కొండ గనుల్లో దొరికిన అరుదైన నీలి వజ్రం (Blue diamond) ఇప్పుడు వేలానికి వచ్చింది. ఈ 23.24 క్యారెట్స్ ‘గోల్కొండ బ్లూ డైమండ్ (Golconda blue diamond)’ విలువ సుమారుగా రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్ల వరకు ఉంటుందని పర్షియాకు చెందిన వజ్రాల డిజైనింగ్ సంస్థ జార్ (JAR) తెలిపింది.
అరుదైన బ్లూ డైమండ్‌ను అమెరికాలోని న్యూయార్క్ ప్రావిన్స్‌లోగల క్రిస్టీస్ ఆభరణాల దుకాణం వేలం వేయనుంది. మే 14న జనీవాలోని క్రిస్టీస్ షోరూమ్‌లో వేలం జరగనుంది. ఈ డైమండ్ ఒకప్పుడు ఇండోర్ మహరాజుకు చెందిన ఉంగరంలో పొదిగి ఉండేదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యుయెలరీ హెడ్ రాహుల్ కడాకియా చెప్పారు. ఈ తరహా ఉంగరం వేలానికి రావడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు.