న్యూఢిల్లీ : ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం 8వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. 200 మంది హెచ్ఆర్ ఉద్యోగుల స్థానంలో ఏఐ ఆధారిత ఏజెంట్లను నియమించింది. సంస్థలో హెచ్ఆర్ విభాగం నిర్వర్తించే విధులు, ఉద్యోగుల మెయిల్స్‌కు సమాధానమివ్వడం, పేపర్ వర్క్ వంటివి ప్రాసెస్ చేయడం లాంటివి ఏఐ ఏజెంట్లకు అప్పగించినట్టు తెలుస్తున్నది. ఐబీఎం సీఈవో కృష్ణ మాట్లాడుతూ సంస్థ పురోభివృద్ధికి ఏఐ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. దీని ద్వారా వచ్చిన పొదుపును సంస్థ ఇతర వ్యాపార అవసరాలకు వినియోగించనున్నట్టు చెప్పారు.
సుమారు 3వేల మంది కార్యాలయ ఉద్యోగులను తొలగించినట్టు వోల్వో కంపెనీ ప్రకటించింది. వ్యయభార నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. స్వీడన్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం ధరల పెరుగుదల, ఈవీలకు డిమాండ్ తగ్గడం, వాణిజ్య అనిశ్చితి ఇబ్బందులను ఎదుర్కొంటున్నది.