Puja Khedkar | పుణే జిల్లా కోర్టు ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌ను ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి పంపింది. భూ వివాదంలో పలువురిని తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల మేరకు పోలీసులు మరోరమను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాయగఢ్ జిల్లా మహద్‌లోని ఓ లాడ్జి నుంచి మనోరమను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చాలా రోజుల నుంచి ఆమె అక్కడే తలదాచుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోరమను రాయ్‌గఢ్ నుంచి పుణెలోని పౌడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అధికారికంగా అరెస్టు చేశారు. అనంతరం మనోరమను స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆమెకు కోర్టు ఈ నెల 20 వరకు కస్టడీ విధించింది.
పుణెలోని ముల్షి తహసీల్‌లోని ధద్వాలీ గ్రామంలో ఒక భూ వివాదంపై మనోరమ కొంతమందిని తుపాకీతో బెదిరింపులకు పాల్పడినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. అప్పటి నుంచి పోలీసులు ఆమెతో పాటు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ కోసం గాలిస్తున్నారు. నిందితురాలు మనోరమ, ఆమె భర్త దిలీప్‌తో పాటు మరో ఐదుగురి పోలీసులు ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజ ఖేద్కర్ ఇప్పటికే చిక్కుల్లో పడ్డారు. ఆమెకు సంబంధించి పలు వివాదాలు తెరపైకి రావడంతో ప్రభుత్వం ఇటీవల ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె శిక్షణను ఆపేసిన ప్రభుత్వం ఈ నెల 23లోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆమెను విధుల నుంచి రిలీవ్ చేశారు. మరోవైపు, పుణే కలెక్టర్ సుహాస్ దివాసే తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు పూజ ఫిర్యాదు చేసింది.
Trainee IAS officer Puja’s mother Manorama Khedkar has been detained from Mahad, according to Pune SP Pankaj Deshmukh. She is accused of allegedly threatening farmers by brandishing a gun, reports @ymjoshi
pic.twitter.com/96Rtyk4nVf— HTMumbai (@HTMumbai) July 18, 2024