IAF helicopter : భారత వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్‌ను పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందకు దించినట్లు భారత వాయుసేనకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్ జిల్లాలోని రంగ్మతి డ్యామ్ సమీపంలోగల చెంగా గ్రామంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది.
అయితే హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని జామ్‌నగర్ పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. జామ్‌నగర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు సరిగ్గా 22 కిలోమీటర్ల దూరంలో చెంగా గ్రామం ఉంటుందన్నారు. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని చెప్పారు.