పాట్నా: వరద బాధితుల కోసం సామగ్రిని తీసుకువెళ్తున్న ఐఏఎఫ్ హెలికాప్టర్ అదుపుతప్పింది. వరద నీటితో నిండిన ప్రాంతంలో అది ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. (IAF Helicopter Crashes) పైలట్, అందులోని జవాన్లు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు పడవల్లో హెలికాప్టర్ వద్దకు చేరుకుని వారిని కాపాడారు. ఆ హెలికాప్టర్లో ఉన్న సహాయ సామగ్రిని మరికొందరు ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. కోసి బ్యారేజ్ నుంచి భారీగా నీటి విడుదల కారణంగా అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి.
కాగా, బుధవారం ఒక ఐఏఎఫ్ హెలికాప్టర్ ద్వారా సీతామర్హి నుంచి వరద సహాయ సామగ్రిని పంపారు. అయితే ఔరాయ్‌లోని నయా గావ్‌లో వరద మయమంగా మారిన ప్రాంతంలో ఆ హెలికాప్టర్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. పైలట్, అందులోని జవాన్లు సురక్షితంగా ఉన్నారు.
మరోవైపు నీటిలో దిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ వద్దకు పడవల ద్వారా స్థానికులు చేరుకున్నారు. అందులో ఉన్న పైలట్, జవాన్లను కాపాడారు. అలాగే ఆ హెలికాప్టర్లో ఉన్న వరద సహాయ సామగ్రిని కొందరు ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
मुजफ्फरपुर में वायु सेना का हेलीकॉप्टर हुआ क्रैश, बाढ़ राहत सामग्री पहुंचाने के लिए भरा था उड़ान, Watch Video #HelicopterCrash #Muzaffarpur #BiharNews #BiharFlood #FloodNews pic.twitter.com/DqteaZ4Fkp
— News4Nation (@news4nations) October 2, 2024