భవిష్యత్ రణతంత్రం | వైరస్లు, హైపర్సోనిక్ మిసైల్స్‌తో దాడులు : ఐఏఎఫ్ చీఫ్ వార్నింగ్
భవిష్యత్ రణతంత్రం ఎవరూ ఊహించలేని పద్ధతుల్లో ఉంటుందని, శత్రువు ఎవరో ఎన్నటికీ తెలియదని భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి మంగళవారం హెచ్చరించారు.
న్యూఢిల్లీ : భవిష్యత్ రణతంత్రం ఎవరూ ఊహించలేని పద్ధతుల్లో ఉంటుందని, శత్రువు ఎవరో ఎన్నటికీ తెలియదని భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి మంగళవారం హెచ్చరించారు. భవిష్యత్ యుద్ధాలు కంప్యూటర్ వైరస్లు, హైపర్సోనిక్ క్షిపణుల వంటి హైబ్రిడ్ మోడ్‌లో ఉంటుందని స్పష్టం చేశారు. అసలు శత్రువెవరో ఎన్నటికీ పసిగట్టలేని పరిస్ధితులు ఎదురవుతాయని అన్నారు.
రాబోయే యుద్ధాలు ఓ దేశం, సంస్ధతోనో కాకపోవచ్చని, భవిష్యత్ యుద్ధతంత్రం కంప్యూటర్ వైరస్ల నుంచి హైపర్సోనిక్ మిసైల్స్ వరకూ ఏ రూపంలోనైనా ముంచుకొస్తాయని పేర్కొన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఏడవ జాతీయ నాయకత్వ సదస్సు (ఎన్ఎల్సీ)ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నూతన పోకడల రాకతో మన సంప్రదాయ యుద్ధ పరికరాలు, యంత్రాలను సంస్కరించి, తిరిగి డిజైన్ చేసి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఐఏఎఫ్ చీఫ్ స్పష్టం చేశారు. ప్రపంచం పరస్పర ఆధారితంగా మారినందున మన నెట్‌వర్క్‌లపై సైబర్ దాడులు జరిగితే కమాండ్ కంట్రోల్ వ్యవస్ధలు నిర్వీర్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

