ముంబై: కుమారుడి సంస్థకు సంబంధించిన భూ రిజిస్ట్రేషన్ వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. తన మనస్సాక్షిని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అజిత్ పవార్ కుమారుడు పార్థ్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ పూణేలోని ముంధ్వా ప్రాంతంలో రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.300 కోట్లకు దక్కించుకున్నది.
కాగా, కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అజిత్ పవార్ కుమారుడి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. దీంతో ఈ భూమి కొనుగోలు ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రెవెన్యూ శాఖలోని సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశించింది.
మరోవైపు సామాజిక కార్యకర్త అంజలి దమానియా ఈ సంఘటనపై స్పందించారు. భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పూణేలో ఈ డిమాండ్‌ను మీడియా ప్రస్తావించింది. దీంతో ‘నా మనస్సాక్షిని ఉపయోగించి నేను నిర్ణయం తీసుకుంటా’ అని అజిత్ పవార్ అన్నారు. అలాగే తన కొడుకును ఆయన సమర్థించారు. ఆ కంపెనీ కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వానికి చెందినది అన్నది పార్థ్‌కు తెలియదని అన్నారు.
Also Read:
Watch: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితులను డ్రోన్‌తో వెంబడించిన కెమెరామెన్
Watch: రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం చేసిన వ్యక్తి