RajBhar on Akhilesh | అఖిలేశ్‌ను ఏసీ రూమ్‌ల్లోంచి బయటికి లాక్కొస్తా.. రాజ్‌భర్ సంచలనం
RajBhar on Akhilesh | సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ను ఏసీ రూమ్‌ల్లోంచి బయటకు లాక్కొస్తానని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ప్రకటించారు.
RajBhar on Akhilesh | ఏసీ రూమ్‌ల్లోంచి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను బయటకు తీసుకొస్తానని ఆయన మిత్రపక్షం సుహెల్దేవ్ భారతీయ సమాజ్‌పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎస్పీతో ఎస్బీఎస్పీ జట్టు కట్టిన సంగతి తెలిసిందే.
తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎస్పీని వీడబోనని ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చెప్పారు. ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌భర్ సారధ్యంలోని ఎస్బీఎస్పీ ఆరు స్థానాలు గెలుచుకున్నది. అఖిలేశ్ యాదవ్‌తో మితృత్వాన్ని తెగదెంపులు చేసుకుంటానని వచ్చిన వదంతులను రాజ్‌భర్ కొట్టి పారేశారు. తుది శ్వాస విడిచే వరకూ కూటమిలోనే కొనసాగుతానని చెప్పారు.
వందశాతం దృఢ నిశ్చయంతో ఈ మాట చెబుతున్నానని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు తమ కూటమి కొనసాగుతుందని, తమ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయన్నారు. ఎస్పీ అధినేత ప్రజల్లోకి రావాలని ఆయన సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారన్నారు. తూర్పు యూపీలో ఇతర బీసీ కులాల్లో పట్టున్న నాయకుడు రాజ్‌భర్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

