న్యూఢిల్లీ, డిసెంబర్ 12: అంతర్జాతీయ వేదికల్లో పాల్గొన్నప్పుడు భారత్లోని రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే తాను తల దించుకోవాల్సి వస్తున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం లోక్సభలో రోడ్డు ప్రమాదాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. తాను కేంద్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలోని రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు.
మానవ ప్రవర్తన మెరుగుపడాలంటే సమాజంలో మార్పు రావాలని, చట్టబద్ధమైన పాలనను గౌరవించాలని మంత్రి తెలిపారు. రహదారులపై ట్రక్కులను కొందరు ఇష్టానుసారం నిలిపివేస్తున్నారని, చాలా మంది ట్రక్కు డ్రైవర్లు లేన్ క్రమశిక్షణను పాటించరని, ఇవే ప్రమాదాలకు ప్రధాన కారణమని గడ్కరీ పేర్కొన్నారు.
దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య
60%– రోడ్డు ప్రమాద బాధితుల్లో
18-34 ఏండ్ల వయసువారు