న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: మీ దేవుణ్ని వేడుకోండి అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా నుంచి ఘాటుగా విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బుధవారం స్పందిస్తూ తాను అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు. మరో కేసు విచారణ సందర్భంగా బుధవారం సీజేఐ ఈ వివరణ ఇవ్వగా తాను కూడా ఈ పోస్టులను సోషల్ మీడియాలో చూశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
యునెస్కో గుర్తించిన మధ్యప్రదేశ్లోని ఖజురహో ఆలయ సముదాయంలో భాగమైన జవారీ ఆలయంలోని ఏడు అడుగుల శ్రీమహావిష్ణు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మంగళవారం తోసిపుచ్చిన సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.