Ratna Debnath: నేను నా కూతుర్ని కోల్పోయా.. మమతా బెనర్జీ తన కుర్చీ కోల్పోయింది
Ratna Debnath: తాను, మమతా బెనర్జీ బాధలో ఉన్నామని బీజేపీ ఎమ్మెల్యే రత్నా దేబనాథ్ అన్నారు. నేను నా కూతుర్ని కోల్పోయాను, ఇక మమతా బెనర్జీ తన సీఎం కుర్చీని కోల్పోయిందని ఆమె విమర్శించారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన మెడికల్ విద్యార్థి తల్లియే రత్నా దేబనాథ్.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న పీజీ విద్యార్థి 2024లో అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ విద్యార్థిని తల్లి రత్నా దేబనాథ్(Ratna Debnath).. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచారు. పాణిహట్టి నుంచి విజయం సాధించిన ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్టు పెట్టారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఓటమి గురించి ఆమె కామెంట్ చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం సువేంధు అధికారిని ఆమె కలిశారు. సచివాలయంలోని 14వ అంతస్తులో ఉన్న సీఎం ఆఫీసుకు ఆమె వెళ్లారు.
తన ఎక్స్ అకౌంట్లో కామెంట్ చేస్తూ.. నబన్నలో ఉన్న 14వ అంతస్తుకు వెళ్లాలని, అక్కడ సీఎం సువేందు అధికారితో భేటీ అయ్యానని, గౌరవప్రదమైన అధికారం చాలా శక్తివంతమైందని, అన్యాయం పట్ల పోరాటేందుకు కేవలం సహనం కావాలని, ఇవాళ మమతా బెనర్జీ, తాను దుఖ్కంలో ఉన్నామని, నేను నా కూతుర్ని కోల్పోయాను అని, ఇక నేను నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేశానని, ఇక మమతా బెనర్జీ 14వ ఫ్లోర్లో ఉన్న కుర్చీని కోల్పోయిందని దేబనాథ్ అన్నారు. మాజీ సీఎం, తృణమూల్ నేతలు రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోనున్నట్లు దేబనాథ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

