John Abraham : మద్యం (Alcohol), మాదకద్రవ్యాలు (Drugs) మనిషి బతుకును ఛిద్రం చేస్తాయని, కాబట్టి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని నటుడు (Actor) జాన్ అబ్రహం (John Abraham) సూచించారు. ఇవాళ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నవీ ముంబై (Navi Mumbai) లో ‘నషా ముక్త్ నవీ ముంబై (Nasha Mukt Navi Mumbai)’ పేరుతో జరిగిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ (Anti-drugs awareness campaign) లో ఆయన మాట్లాడారు.
తాను తన జీవితంలో డ్రగ్స్‌ను ముట్టుకోలేదని, పొగ తాగడం, మద్యం తాగడం లాంటి అలవాట్లు కూడా లేవని జాన్ అబ్రహం చెప్పారు. అందరూ తమ జీవితంలో చాలా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. మీ సహచరులకు, యువతకు మీరు ఆదర్శప్రాయులుగా ఉండాలని అన్నారు. ‘నేను నా జీవింలో డ్రగ్స్ ముట్టుకోలేదు. పొగ తాగడం, మద్యం తాగడం లాంటి అలవాట్లు కూడా లేవు. జీవితంలో చాలా క్రమశిక్షణతో ఉండండి. మీ సహచరులకు, యువతకు ఆదర్శంగా జీవించండి’ అని జాన్ అబ్రహం కార్యక్రమంలో పాల్గొన్న వారికి సూచించారు.
#WATCH | Navi Mumbai | At the ‘Nasha Mukt Navi Mumbai’ campaign event, Actor John Abraham says, “I have not touched drugs in my life, also no smoking, no drinking. Be very disciplined in life, and be a role model to your colleagues and youngsters. Be a good citizen.” pic.twitter.com/UoDyumLa1p
— ANI (@ANI) January 8, 2025
ప్రతి ఒక్కరూ మంచి పౌరులుగా జీవించాలని, అప్పుడు సమాజం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని జాన్ అబ్రహం చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. జాన్ అబ్రహంను కొనియాడారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటంవల్లే జాన్ అబ్రహం ఇంత కూల్‌గా ఉండగలుగుతున్నాడని అన్నారు. సైబర్ సేఫ్ నవీ ముంబై అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
#WATCH | Navi Mumbai | At the anti-drugs awareness campaign event, Maharashtra CM Devendra Fadnavis says, “…Why is John Abraham cool? Because he says no to drugs…”
Visuals source: Cyber Safe Navi Mumbai Official pic.twitter.com/7mh1geXyIM
— ANI (@ANI) January 8, 2025