సోమవారం 25 జనవరి 2021
National - Jan 04, 2021 , 13:01:23

ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకోను : మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకోను : మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

భోపాల్: కోవిడ్ టీకాను ఇప్పుడే తీసుకోబోను అని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.  అవ‌స‌ర‌మైన వారికి తొలుత ఆ టీకాను ఇవ్వాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.  కోవిడ్ టీకాను తాను త‌ర్వాత తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర‌మైన ప్రయార్టీ గ్రూపుల‌కు తొలుత టీకాను ఇవ్వాల‌ని సీఎం శివ‌రాజ్ సూచించారు.  శివ‌రాజ్ సింగ్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న  కొన్ని రోజుల పాటు ఆస్ప‌త్రిలో చికిత్స చేసుకున్నారు. 


logo