న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ(Abhishek Manu Singhvi) సీటు వద్ద .. గురువారం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భారీగా నదును గుర్తించారు. ఈ అంశంపై ఇవాళ సభలో దుమారం రేగింది. అయితే ఆ ఘటన పట్ల తెలంగాణ నుంచి ఎంపీగా ఎన్నికైన సింఘ్వీ ఓ వీడియో ద్వారా ప్రకటన చేశారు. రాజ్యసభకు వెళ్తున్న సమయంలో.. ఒకే ఒక్క రూ.500 నోటు పట్టుకెళ్లుతానని సింఘ్వీ తెలిపారు. తన సీటు వద్ద నోట్ల కట్టలు ఉన్న విషయాన్ని మొదటిసారి విన్నట్లు చెప్పారు.
My short statement in English to some journalists. pic.twitter.com/k0i4KukJMw
— Abhishek Singhvi (@DrAMSinghvi) December 6, 2024
గురువారం రోజున మధ్యాహ్నం 12.57 నిమిషాలకు సభలోకి వెళ్లానని, ఆ తర్వాత సరిగ్గా ఒంటి గంటకు సభ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత క్యాంటీన్లో అయోధ్య రామిరెడ్డితో కలిసి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు కూర్చున్నట్లు చెప్పారు. సభలో 3 నిమిషాలు, క్యాంటిన్లో 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని, దీనిపై కూడా రాజకీయం చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో 222 సీటు నెంబర్ను అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారు. అయితే ఆ సీటు వద్ద నగదు లభించిన అంశంపై విచారణ చేపట్టనున్నట్లు చైర్మెన్ ధనకర్ తెలిపారు.