ప్రభుత్వ జోక్యంపై వెయ్యిన్నొక్క ఉదాహరణలు చెబుతా: కేరళ గవర్నర్
Kerala Governor | కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారుతున్నది. గవర్నర్‌కు తెలుపకుండా
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారుతున్నది. గవర్నర్‌కు తెలుపకుండా కేరళ ప్రభుత్వం తొమ్మిది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్లను నియమించడంతో వివాదం మొదలైంది. అక్రమంగా నియమితులైన ఆ వీసీలు తక్షణమే రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశించారు. దాంతో ఆ వీసీలు కోర్టుకు వెళ్లారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కేరళ ప్రభుత్వం విమర్శిస్తున్నది. అయితే, కేరళ సర్కారు విమర్శలపై గవర్నర్ స్పందించారు. యూనివర్సిటీలను నడిపే బాధ్యత ఛాన్సెలర్ అయిన గవర్నర్‌పై ఉంటుందని, ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రభుత్వాన్ని నడుపుతారని చెప్పారు.
ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకుంటున్నానని ఆరోపిస్తున్న ప్రభుత్వం.. తాను ఎక్కడ జోక్యం చేసుకున్నాననో ఒక్క ఉదాహరణ చెప్పాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఒక్క ఉదాహరణ చూపించినా తాను తక్షణమే గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రభుత్వం యూనివర్సిటీల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందనడానికి తాను వెయ్యిన్నొక్క (1,001) ఉదాహరణలు చెబుతానని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

