Mamata Banerjee : బంగ్లాదేశ్ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) పై పశ్చిమబెంగాల్ (West Begal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధినేత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) స్పందించారు. ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ప్రజలంతా శాంతంగా ఉండాలని ఆమె కోరారు. ఈ విషయంలో ప్రచారమయ్యే పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు.
రిజర్వేషన్లకు సంబంధించిన ఆందోళనలు తీవ్ర హింసకు దారితీయడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం సాయంత్రం పదవికి రాజీనామా చేసి ఆర్మీ హెలికాప్టర్లో భారత్కు వచ్చారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఆమె చేరుకున్నట్లు సమాచారం. దీనిపై మమతాబెనర్జి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాలకు సంబంధించిన అంశమని, ఈ విషయంలో కేంద్ర సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతిస్తామని చెప్పారు.
‘బంగ్లాదేశ్ అంశంపై ఎలా వ్యవహరించాలనే విషయాన్ని కేంద్రం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అదేవిధంగా దేశంలో, పశ్చిమబెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా అన్ని పార్టీల నాయకులకు సూచనలు చేస్తుంది.’ అని మమతాబెనర్జి తెలిపారు. కొందరు బీజేపీ నాయకులు దీనిపై ఇప్పటికే వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని ఆమె వ్యాఖ్యానించారు.