Viral | ఐయామ్ సారీ సంజూ.. నోయిడా వీధుల్లో వైరల్‌గా మారిన బిల్‌బోర్డు!
Viral | ప్రేయసి అలిగితే ఎవరైనా ఏం చేస్తారు? ఒక రోజాపువ్వు ఇచ్చి కూల్ చేస్తారు.. చాక్లెట్ ఇచ్చి ఐస్ చేస్తారు.. ఈ ఇంటర్నెట్ యుగంలో అయితే సారీ ఎమోజీలతో వాట్సాప్‌ను నింపేస్తారు. కానీ తనపై కోపానికి వచ్చిన నేస్తానికి క్షమాపణ చెప్పేందుకు ఓ యువతి ఏకంగా పెద్ద హోర్డింగ్నే పెట్టించింది.
Viral | ప్రేయసి అలిగితే ఎవరైనా ఏం చేస్తారు? ఒక రోజాపువ్వు ఇచ్చి కూల్ చేస్తారు.. చాక్లెట్ ఇచ్చి ఐస్ చేస్తారు.. ఈ ఇంటర్నెట్ యుగంలో అయితే సారీ ఎమోజీలతో వాట్సాప్‌ను నింపేస్తారు. కానీ తనపై కోపానికి వచ్చిన నేస్తానికి క్షమాపణ చెప్పేందుకు ఓ యువతి ఏకంగా పెద్ద హోర్డింగ్నే పెట్టించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది.
In today’s episode of what the fuck goes on in Noida pic.twitter.com/cScEMdkZmE
— 🥭 🐭 (@uDasKapital) June 26, 2023
ఐయామ్ సారీ సంజూ.. ఐ విల్ నెవర్ ఎవర్ హర్ట్ యు ఎగైన్.. యువర్ సుష్ ( సంజూ నన్ను క్షమించు.. నిన్ను ఇంకెప్పుడు హర్ట్ చేయను.. నీ ప్రియమైన సుష్ ) అని బిల్‌బోర్డుపై ఉన్న ప్రకటన ఓ వ్యక్తిని విపరీతంగా ఆకట్టుకుంది. నోయిడా సెక్టార్ 125లోని ఓక్లా బర్డ్ సాంక్షరీకి సమీపంలోని ఓ బిల్‌బోర్డ్‌పై కనిపించిన ఈ యాడ్‌ను చూడగానే సదరు వ్యక్తి ఫొటో తీసి ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సారీ చెప్పడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారని ఒక యూజర్ కామెంట్ చేయగా.. సంజూ, అతని ఈగో కోసం ఇంత ఖర్చు పెట్టడం కన్నా మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది అని మరో యూజర్ సలహా ఇచ్చాడు. సంజూ.. సుష్ను క్షమించిందో లేదో అంటూ ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. కాగా, ఇది ఫొటోషాప్ చేసినది అయ్యుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

