ఆఫ్టర్ 9 పబ్‌లో అశ్లీల నృత్యాలు
కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎరగా వేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఆఫ్టర్ 9 పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
- టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పట్టుబడ్డ 32 మంది యువతులు
- నిర్వాహకులు సహా కస్టమర్లపై కేసు నమోదు
బంజారాహిల్స్, మే 5: కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎరగా వేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఆఫ్టర్ 9 పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నిర్వహించిన దాడుల్లో 32 మంది యువతులు అశ్లీల నృత్యాలు చేయడంతో పాటు గలీజు పనులు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో పబ్ నిర్వాహకులతో పాటు కస్టమర్లపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఆఫ్టర్ 9 పబ్‌లో గత కొంతకాలంగా అశ్లీల నృత్యాలు చేస్తున్నారని, పబ్‌లోకి వచ్చే వారిని ఆకర్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొస్తున్న పబ్ నిర్వాహకులు డబ్బులు దండుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శనివారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించారు. భారీ శబ్దాలతో డీజే నడిపిస్తుండటంతో పాటు మద్యం మత్తులో ఉన్న యువకులను రెచ్చగొట్టేలా నృత్యాలు చేస్తున్న యువతులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు.
పబ్ గేటు వద్దనే యువతులను సరఫరా చేస్తూ డబ్బులు గుంజుతున్నట్లు తేలింది. దీంతో అదనపు ఆదాయం కోసం పబ్ నిర్వాహకులు అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహించడంతో పాటు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పబ్ మేనేజర్లు, క్యాషియర్, డీజే ఆపరేటర్, ఐదుగురు బౌన్సర్లు, 131 మంది కస్టమర్లు, 32మంది యువతులను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ 294, 188 సెక్షన్లతో పాటు సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఆఫ్టర్ 9 పబ్‌పై పలు ఆరోపణలు రావడంతో హెచ్చరించామని.. అయినా పట్టించుకోకుండా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేలడంతో పబ్‌ను సీజ్ చేయించనున్నామని, పబ్ లైసెన్స్ కూడా రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖకు సిఫార్సు చేయనున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

