న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయన డిప్యూటీ చైర్మెన్ హరివంశ్‌కు క్షమాపణలు చెప్పారు. జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై చర్చ చేపట్టేంందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ఖర్గే అన్నారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని తోసి వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తోకేంగే అంటూ హిందీ పదాన్ని వాడారు. దీని పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చైర్‌ను చూస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత జేపీ నడ్డా డిమాండ్ చేశారు.
“kisko thokne ki baat kar rahe ho @kharge uncle? pic.twitter.com/EmJ4RgCX47
— Politics Pe Charcha (@politicscharcha) March 11, 2025
తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు ఖర్గే తెలిపారు. ఖర్గే వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో తాను అలా మాట్లాడానని, చైర్‌ను ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదన్నారు. త్రిభాషా విధానాన్ని తమిళనాడు సర్కారు అమలు చేయడం లేదని ఎన్ఈపీపై మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆయన తమిళనాడు సర్కారును తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ.. అనాగరికంగా డీఎంకే ఎంపీలు వ్యవహరిస్తున్నట్లు మంత్రి ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. డీఎంకే ఎంపీలు ధర్నా చేపట్టాయి. మంత్రి రాజీనామా కోరుతూ డీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు.