పాట్నా: బీహార్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీకి బయలు దేరారు. బుధవారం రాత్రి చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, భార్య రబ్రీ దేవితో కలిసి పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు ఆయన వచ్చారు. తన ఆరోగ్యం బాగోలేదని, చికిత్స కోసం ఢిల్లీ వెళ్తున్నానని మీడియాతో అన్నారు.
పశువుల దాణా కుంభకోణంలో జైలు శిక్ష పడిన లాలూ, అనారోగ్య కారణాలతో బెయిల్‌పై విడుదల అయ్యారు. కొన్ని నెలలు ఢిల్లీలోనే ఉన్న ఆయన ఇటీవల బీహార్‌కు వచ్చారు. ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆర్జేడీ అభ్యర్థుల గెలుపు కోసం రెండు నియోజకవర్గాల్లో హెలీకాప్టర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. సీఎం నితీశ్‌పై పలు విమర్శలు చేశారు.
అయితే ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో లాలూ ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.