న్యూఢిల్లీ : పదవీ విరమణ చేయనున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌కు చివరి పని దినమైన శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తనకు జరిగిన వీడ్కోలుకు కృతజ్ఞతలు చెబుతూ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని ముగించి పూర్తి సంతృప్తితో, న్యాయ విద్యార్థిగా సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఆయన చెప్పారు.
శుక్రవారం సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ నిర్వహించిన మరో వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడుతూ షెడ్యూల్డు కులాల్లోని క్రిమీలేయర్లకు అడ్మిషన్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాలు నిరాకరించవచ్చునని తాను ఇచ్చిన తీర్పులలో ఒకదానిపై తన సొంత సమాజం నుంచి ఎదుర్కొన్న ఆగ్రహాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.