Vartika : పాకిస్థాన్ (Pakistan) శనివారం కాల్పుల విరమణకు అంగీకారం తెలుపుతూనే మాటతప్పింది. ఒప్పందం కుదిరిన మూడు గంటలకే దొంగదెబ్బ కొట్టింది. ఆర్ఎస్ పుర సెక్టార్ (RS Pura sector) లో భారత్‌పై డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడిని భారత సైన్యం (Indian Army) సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పోరాటంలో ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లు, బీఎస్ఎఫ్ (BSF) కు చెందిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ (SI) తోపాటు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా (Sergeant Surendra Moga) వీరమరణం పొందారు.
తన తండ్రి మరణంపై సురేంద్ర మోగా కుమార్తె, చిన్నారి వర్టిక స్పందించారు. దేశాన్ని రక్షించడం కోసం శత్రువులను చంపుతూ తన తండ్రి వీర మరణం పొందడం తనకు ఎంతో గర్వంగా ఉన్నదని చెప్పారు. శనివారం రాత్రి 9 గంటలకు తాము తన తండ్రితో ఆఖరి సారి మాట్లాడామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశంలో పాక్ డ్రోన్లు చక్కెర్లు కొడుతున్నాయని, అయితే దాడి ఏమీ జరగడం లేదని చెప్పారని వర్టిక వెల్లడించారు. ఇంతలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ పూర్తిగా అంతం కావాలని వర్టిక అన్నారు. ఆ దేశం పేరు కూడా వినపడకూడదని వ్యాఖ్యానించారు. తాను కూడా తన తండ్రిలాగానే సైనికురాలిని అవుతానని, తన తండ్రి మరణానికి పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పారు. తాను వాళ్లను ఒకరి తర్వాత ఒకరిని ఖతం చేస్తానని అన్నారు. చిన్నారి వర్టిక ఆవేదన, ఆక్రోశంతో మీడియాతో మాట్లాడిన మాటలను కింది వీడియోలో మీరు కూడా వినవచ్చు.
#WATCH | Jhunjhunu, Rajasthan | Vartika, Daughter of Sergeant Surendra Moga, says, “I am feeling proud that my father got martyred while killing the enemies and protecting the nation… Last time, we talked to him at 9 PM last night and he said that drones are roaming but not… https://t.co/H0EI1xKw4e pic.twitter.com/0mIHuHT8iL
— ANI (@ANI) May 11, 2025