Rowdy Sheeter : హైదరాబాద్ (Hyderabad) కు చెందిన ఓ రౌడీ షీటర్ (Rowdy sheeter) గోవా (Goa) లో మరో హత్య (Murder) కు పాల్పడ్డాడు. ఓ క్యాషినో సెక్యూరిటీ గార్డు (Casino Security guard) ను కత్తితో నరికి చంపాడు. మరో గార్డును కూడా తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం నిందితుడు పారిపోతుండగా దబోలిమ్ ఎయిర్పోర్టు (Dabolim airport) లో అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ అల్తాఫ్పై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. బెయిల్పై బయట తిరుగుతున్న అతడు తరచూ గోవాలో క్యాషినోలకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఇటీవల కూడా క్యాషినోకు వెళ్లాడు. పనాజీలోని ఓ స్టార్ హోటల్ క్యాషినోలో ఫూటుగా మద్యం సేవించి హల్చల్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
దాంతో వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ధీరూ శర్మ (Dheeru Sharma) అనే 30 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సత్యం గోయెంకర్ అనే మరో గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం రౌడీ షీటర్ అల్తాఫ్ పారిపోతుండగా దబోలిమ్ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.